LOADING...
Jos Buttler: 122 మీటర్ల ఎత్తు నుంచి అద్భుత క్యాచ్.. జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్!
122 మీటర్ల ఎత్తు నుంచి అద్భుత క్యాచ్.. జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్!

Jos Buttler: 122 మీటర్ల ఎత్తు నుంచి అద్భుత క్యాచ్.. జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్'కు చెందిన వికెట్‌కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన దూకుడు బ్యాటింగ్‌తోనే కాదు, అద్భుతమైన వికెట్‌కీపింగ్ నైపుణ్యంతో కూడా ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఆటగాడు. తాజాగా మరోసారి బట్లర్ తన అద్భుత క్యాచ్‌తో వార్తల్లోకి వచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘనత ఒక ప్రత్యేక ఛాలెంజ్‌లో చోటుచేసుకుంది.ఈ ఛాలెంజ్‌లో సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు.

వివరాలు 

119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టిన థిమోతి షానన్ జెబసీలన్

అంత ఎత్తు నుంచి వేగంగా కిందికి దూసుకొస్తున్న బంతిని కళ్లప్పగించి గమనించిన బట్లర్, సరైన సమయాన్ని ఎంచుకుని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ వీడియోను ఇంగ్లాండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ బట్లర్‌ను ప్రశంసించాడు. ఇంతకుముందు 2021లో ఆస్ట్రేలియాకు చెందిన థిమోతి షానన్ జెబసీలన్ 119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా బట్లర్ పట్టిన క్యాచ్ ఆ రికార్డును అధిగమించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

త్వరలోనే బట్లర్ పేరు గిన్నిస్ బుక్‌లో..

అధికారిక ధృవీకరణ రావాల్సి ఉన్నప్పటికీ,త్వరలోనే బట్లర్ పేరు గిన్నిస్ బుక్‌లో నమోదు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా,టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు పోరాటాల్లో బట్లర్ వరుసగా 26,21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మంచి ఆరంభాలు దక్కినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లను స్కాట్లాండ్, ఇటలీ జట్లతో ఆడనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్

Advertisement