LOADING...
Josh Inglis: లిమిటెడ్ అవైలబిలిటీ.. అయినా రూ.8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను దక్కించుకున్న లక్నో
లిమిటెడ్ అవైలబిలిటీ.. అయినా రూ.8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను దక్కించుకున్న లక్నో

Josh Inglis: లిమిటెడ్ అవైలబిలిటీ.. అయినా రూ.8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను దక్కించుకున్న లక్నో

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
09:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ భారీ ధర పలికాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అతడిని రూ.8.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లిస్ బేస్ ప్రైస్ కేవలం రూ.2కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే,ఈ సీజన్‌లో అతడి అందుబాటు చాలా పరిమితమని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపించాయి. ఐపీఎల్‌ 2026లో జోష్ ఇంగ్లిస్ కేవలం 25 శాతం మ్యాచ్‌లకే అందుబాటులో ఉంటాడు. అంటే గరిష్టంగా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. అంతర్జాతీయ కట్టుబాట్లు,వ్యక్తిగత కారణాలు,ముఖ్యంగా అతడి వివాహం కారణంగా పూర్తి సీజన్‌కు దూరంగా ఉండనున్నాడు. అయినప్పటికీ, లక్నో అతడిపై భారీ పెట్టుబడి పెట్టింది.

వివరాలు 

పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన 11 మ్యాచ్‌ల్లో 278పరుగులు

ఇంగ్లిస్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH)మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు జట్లు వరుసగా బిడ్‌లు పెంచుతూ వెళ్లాయి. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా చివరికి సన్‌రైజర్స్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రూ.8.6 కోట్ల వద్ద లక్నో ఇంగ్లిస్‌ను సొంతం చేసుకుంది.కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపగల వికెట్‌కీపర్-బ్యాటర్లకు ఫ్రాంచైజీలు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఇది మరోసారి చూపించింది. ఇంగ్లిస్ విలువ పెరగడానికి అతడి తాజా ఐపీఎల్ ప్రదర్శన కూడా ప్రధాన కారణం. ఐపీఎల్‌ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అతడు 11 మ్యాచ్‌ల్లో 278పరుగులు చేశాడు. 162.57 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్న ఇంగ్లిస్,ముంబయి ఇండియన్స్‌పై 42 బంతుల్లో 73పరుగుల మ్యాచ్‌ విజేత ఇన్నింగ్స్ ఆడాడు.

వివరాలు 

టీ20 క్రికెట్‌ లో  162 మ్యాచ్‌ల్లో 3,853 పరుగులు 

అలాగే క్వాలిఫయర్-2లో జస్ప్రీత్ బుమ్రాపై దూకుడుగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం టీ20 క్రికెట్‌ను పరిశీలిస్తే, జోష్ ఇంగ్లిస్ 162 మ్యాచ్‌ల్లో 3,853 పరుగులు చేశాడు. అతడి సగటు 29.86 కాగా, స్ట్రైక్‌రేట్ 149.98గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో 20 అర్ధసెంచరీలు, నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ రికార్డులే పరిమిత అందుబాటు ఉన్నప్పటికీ ఇంగ్లిస్‌కు ఐపీఎల్‌ వేలంలో భారీ ధర పలికేలా చేశాయి.

Advertisement