Page Loader
ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్
జువెంటస్ ఇంటర్ మిలాన్‌పై 1-0 తేడాతో విజయం సాధించింది.

ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

సెరీ A 2022-23 సీజన్‌లో 27వ మ్యాచ్‌లో ఇంటర్‌ మిలాన్‌పై జువెంటస్ 1-0 తేడాతో విజయం సాధించింది. 23వ నిమిషలో జువెంటస్ తరుపున ఫిలిప్ కోస్టిక్ గోల్ చేసి విజృంభించాడు. ఇంటర్ మిలాన్ అంతకుముందు AS రోమాపై 1-0తో విజయం సాధించిన సాధించింది. ప్రస్తుతం ఈ ఓటమితో ఇంటర్ మిలాన్ మూడవ స్థానానికి పడిపోయారు. అయితే టోరినోను 4-0తో ఓడించిన నాపోలి సీరీ A స్టాండింగ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. నాపోలి 27 మ్యాచ్‌లలో 71 పాయింట్లు సాధించడం విశేషం. లాజియో 52 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. జువెంటస్ 41 పాయింట్లతో 7వ స్థానానికి చేరుకుంది.

ఇంటర్ మిలాన్

ఇంటర్ మిలాన్‌పై జువెంటెస్‌కు మెరుగైన రికార్డు

ఇంటర్ మిలాన్, జువెంటస్ ఇప్పటివరకూ 180 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. జువెంటస్ 87 విజయాలు సాధించి, ఇంటర్ మిలాన్ పై మెరుగైన రికార్డు నమోదు చేసింది. ఇంటర్ మిలాన్ 48 విజయాలు సాధించింది. ఇందులో 45 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఇంటర్‌ మిలాన్ 18సార్లు ప్రయత్నిచగా.. మూడుసార్లు మాత్రమే లక్ష్యాన్ని చేధించింది. జువెంటెస్ 7 సార్లు ప్రయత్నించగా.. మూడుసార్లు లక్ష్యాన్ని చేరుకుంది. ఇంటర్‌లో 70శాతం బాల్ స్వాధీనం చేసుకొని, 88శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇంటర్ కూడా ఆరు కార్నర్లు సాధించడం విశేషం.