Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి
భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. అంటాల్యలో మంగళవారం జరిగిన కాంపౌండ్ క్యాలిఫయింగ్ ఈవెంట్‌లో జ్యోతి మొత్తం 713 పాయింట్ల స్కోరును చేసింది. గతంలో సారాలోపెజ్ 713 పాయింట్లతో 2015లో నమోదు చేసిన ప్రపంచరికార్డును ఆమె ప్రస్తుతం సమం చేసింది. క్వాలిఫయింగ్ లో తొలి, రెండో రౌండ్లో ఒక్కో ఆర్చర్ 36 బాణాలు సందిస్తారు. అయితే తొలి రౌండ్ లో సురేఖ 353 పాయింట్లు, రెండో రౌండ్ లో 360 పాయింట్లు సాధించడం విశేషం. జ్యోతి రెండో రౌండ్ లో కొట్టిన 36 బాణాల్లో 10 పాయింట్ల సర్కిల్ లోకి వెళ్లాయి.
తొలి మహిళా ఆర్చర్‌గా జ్యోతి
ఈ నేపథ్యంలో 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా జ్యోతి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ ప్రపంచ రికార్డును సాధిస్తానని తానూ ఊహించలేదని, టాప్ సీడ్ తో మెయిన్ రౌండ్ లో బరిలోకి దిగుతుండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి