LOADING...
Karun Nair: డకౌట్ అయినా రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్‌!
డకౌట్ అయినా రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్‌!

Karun Nair: డకౌట్ అయినా రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా బ్యాటర్‌ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను సాధించాడు. 8 ఏళ్లు, 84 రోజులు, 402 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2017లో చివరిసారిగా ధర్మశాల టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ తరఫున ఆడిన నాయర్, ఈ రీఎంట్రీతో రయద్ ఎమ్రిట్ రికార్డును అధిగమించాడు. ఎమ్రిట్ 396 మ్యాచ్‌ల (10 ఏళ్లు, 337 రోజులు) తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. జో డెన్లీ (8 ఏళ్లు, 294 రోజులు, 384 మ్యాచ్‌లు), మహేళా ఉదవట్టే (8 ఏళ్లు, 52 రోజులు, 374 మ్యాచ్‌లు) తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు.

Details

కెరీర్‌ ప్రారంభం, రీఎంట్రీ వరకు

కరుణ్ నాయర్ 2016లో జింబాబ్వేపై వన్డేలో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఇంగ్లండ్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసి, 2017లో ఆస్ట్రేలియాపై 3 టెస్ట్‌లు ఆడాడు. 2018లో ఇంగ్లండ్‌ పర్యటనకూ ఎంపికయ్యాడు కానీ, 4 టెస్టుల్లో అవకాశం రాలేదు. చివరి మ్యాచ్‌లో కూడా అవకాశం ఉన్నప్పటికీ, హనుమ విహారిని ఆడించారు. ఆ తర్వాత నాయర్ అంతర్జాతీయ జట్టు నుంచి కనుమరుగైపోయాడు.

Details

 402 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ 

2017-2024 మధ్య భారత్‌ మూడు ఫార్మాట్లలో మొత్తం 402 మ్యాచ్‌లు ఆడింది (77 టెస్టులు, 159 వన్డేలు, 166 టీ20లు). ఆ సమయంలో నాయర్ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన, ఇతర ఆటగాళ్ల రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. లీడ్స్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన నాయర్, 8 ఏళ్ల విరామం తర్వాత భారత్‌ తరఫున మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు.

Advertisement

Details

ట్రిపుల్ సెంచరీ హీరో 

2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు నాయర్‌ పేరే. వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత భారత్‌ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు నాయర్. కానీ ట్రిపుల్ సెంచరీ తర్వాత వరుసగా విఫలతల కారణంగా జట్టు నుంచి తప్పక తప్పలేదు. నాయర్‌ ఇప్పటివరకు భారత్‌ తరఫున 7 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. రీఎంట్రీలో డకౌట్ అయినప్పటికీ, నాయర్‌ రికార్డు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది.

Advertisement