LOADING...
KKR: కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే? 
కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే?

KKR: కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) జట్టులో మరో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కారణంగా ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్‌ పండిత్‌ను తప్పించిన ఫ్రాంచైజీ, ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు సిద్ధమైంది. అందిన సమాచారం ప్రకారం, మాజీ భారత క్రికెటర్‌ అభిషేక్‌ నాయర్‌ను కేకేఆర్‌ ప్రధాన కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక అభిషేక్‌ నాయర్‌ గతంలో భారత క్రికెట్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలందించారు. కోల్‌కతా ఫ్రాంచైజీతో ఆయనకు ఇప్పటికే మంచి అనుబంధం ఉంది.

Details

ప్లేయర్ల ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ

ఈ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేసిన సమయంలో ఆటగాళ్ల ప్రదర్శన, ఫామ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి మంచి ఫలితాలను సాధించాడు. అంతేకాదు, ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆయన పర్యవేక్షణలోనే జరిగినదని తెలిసింది. ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అభిషేక్‌ నాయర్‌ ముందున్న సవాలు మాత్రం చిన్నది కాదు. గత సీజన్‌లో గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా ఉన్నప్పుడు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను మళ్లీ అదే విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఈ నియామకంతో కేకేఆర్‌ జట్టులో కొత్త అధ్యాయం మొదలుకానుంది.