GT vs KKR : రఘువంశీ విధ్వంసం.. గుజరాత్‌పై విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా
ఈ వార్తాకథనం ఏంటి
పంతొమ్మిదో ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయం సాధించింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఆశ్చర్యపరిచిన కోల్‌కతా, కీలకమైన రెండు పాయింట్లు దక్కించుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ (93 పరుగులు), రఘువంశీ (82 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 247 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్థిని సమర్థంగా కట్టడి చేసింది. గిల్ (85), బట్లర్ (57) అర్ధశతకాలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
వివరాలు
మరింత ఆసక్తికరంగా మ్యాచ్..
ఐపీఎల్ 19లో ప్లే ఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. కష్టమే అనుకున్న జట్లు కూడా సంచలన విజయాలతో టాప్ జట్లకు షాకులిస్తున్నాయి. మొన్న ముంబై, నిన్న లక్నో, ఇప్పుడు కేకేఆర్ సూపర్ విజయం సాధించి నాకౌట్ పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా, గుజరాత్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఫిన్ అలెన్ (93), రఘువంశీ (82 నాటౌట్)ల భారీ ఇన్నింగ్స్‌తో పెద్ద స్కోరు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Ghar pe jeet, dil mein belief 💜 pic.twitter.com/r4XhouLuZr
— KolkataKnightRiders (@KKRiders) May 16, 2026