Anil Kumble : కేకేఆర్ పెద్ద తప్పు చేసింది.. శ్రేయస్, సాల్ట్‌లను వదులుకోవడంపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కోల్ కత్తా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లను వదులుకోవడం ఆ జట్టు చేసిన పెద్ద తప్పు అని భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కీలక ఆటగాళ్లను జట్టులో నిలుపుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోకపోతే ఐపీఎల్ టైటిల్‌కు కోల్‌కతా బలమైన పోటీదారుగా నిలవలేదని ఆయన హెచ్చరించాడు. 2024లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత శ్రేయస్‌తో పాటు ఫిల్ సాల్ట్ కూడా ఆ జట్టును వీడారు. అనంతరం శ్రేయస్ పంజాబ్ కింగ్స్ జట్టులో చేరగా, సాల్ట్ బెంగళూరు తరఫున ఆడేందుకు వెళ్లిపోయాడు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత పంజాబ్ ఫైనల్‌కు చేరగా, ఆర్సీబీ తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం.
Details
మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది
ఈ విషయంపై స్పందించిన కుంబ్లే మాట్లాడుతూ.. "రెండేళ్ల క్రితం కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచి మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఆ విజయానికి శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లిద్దరూ కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ కోల్‌కతా జట్టు వారిని కొనసాగించలేదు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విషయంలో జట్టుకు స్థిరత్వం కనిపించడం లేదు. శ్రేయస్, సాల్ట్‌లను వదులుకోవడం కేకేఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం జట్టుకు అజింక్యా రహానే రూపంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా ఆయన ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదని కుంబ్లే అన్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు.