
KKR vs SRH: ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ అరుదైన చరిత్ర.. తొలి జట్టుగా రికార్డు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)మరో అరుదైన ఘనతను సాధించింది.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్‌లో మూడు విభిన్న జట్లపై 20కి పైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కోల్‌కతా నిలిచింది.
సన్‌రైజర్స్‌పై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20, పంజాబ్ కింగ్స్‌పై 21 విజయాలు నమోదు చేసింది.
అదేవిధంగా, 2023-25 మధ్య కాలంలో సన్‌రైజర్స్‌పై వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇదే రికార్డును దిల్లీ క్యాపిటల్స్ (2020-23) కూడా నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమిగా నమోదైంది.
Details
వైభవ్ అరోరాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
కేకేఆర్ 80 పరుగుల తేడాతో విజయం సాధించడంతో, సన్‌రైజర్స్ చరిత్రలోనే అత్యంత భారీ పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా (3/29) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అతడు హైదరాబాద్‌ను కట్టడి చేశాడు.
ఈ ఆకట్టుకునే స్పెల్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.