
Anjikya Rahane: ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ జట్టు కెప్టెన్‌కు గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయదుందుబి మోగించింది.
మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి కేకేఆర్ ఎగబాకింది. అయితే ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకుంటున్న కేకేఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే గాయపడ్డాడు.
మ్యాచ్ సమయంలో బంతిని ఆపే ప్రయత్నంలో రహానే చేతికి గాయమైంది. బంతి తాకగానే అతడి చేతి వేలి నుంచి రక్తం కారింది.
Details
మిగిలిన మ్యాచులకు దూరమయ్యే అవకాశం
తీవ్ర నొప్పితో బాధపడిన రహానేకు వెంటనే ఫిజియో వైద్యం అందించాడు. అయినా గాయం తీవ్రమవుతున్న నేపథ్యంలో రహానే మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఆ తర్వాత కెప్టెన్‌గా సునీల్ నరైన్ బాధ్యతలు స్వీకరించి, ఢిల్లీపై ఒత్తిడి తీసుకువచ్చి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు.
తన గాయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన రహానే.. ప్రస్తుతం తాను మెరుగ్గానే ఉన్నట్లు తెలిపాడు.
అయితే జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం మాత్రమే రహానే తదుపరి మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఒకవేళ అతడి గాయం తీవ్రంగా ఉంటే, అతను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ పరిస్థితి కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.