LOADING...
Team India: టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్‌ రాహుల్, మహమ్మద్‌ సిరాజ్‌కి చోటు
టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్‌ రాహుల్, మహమ్మద్‌ సిరాజ్‌కి చోటు

Team India: టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్‌ రాహుల్, మహమ్మద్‌ సిరాజ్‌కి చోటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ జట్ల మధ్య ఈ నెల అనధికారిక క్రికెట్‌ సిరీస్‌ జరగనుంది. రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు జరగనున్నాయి. టెస్ట్‌ మ్యాచ్‌లు లఖ్‌నవూలోని ఏక్‌నా స్టేడియంలో జరుగుతాయి. సెప్టెంబర్‌ 16న మొదటి టెస్ట్‌, సెప్టెంబర్‌ 23న రెండో టెస్ట్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను ప్రకటించింది. రెండో టెస్ట్‌లో కేఎల్‌ రాహుల్, మహమ్మద్ సిరాజ్‌ పాల్గొంటారని BCCI తెలిపింది. మొదటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత, స్క్వాడ్‌లోని ఎవరైనా ఇద్దరు సభ్యుల స్థానంలో వీరు జట్టులోకి చేరతారని వివరించింది. ఈ రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Details

ఆక్టోబర్ 5న కాన్పూర్ వేదికగా మ్యాచ్

మూడో నుండి ఐదో వన్డే మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3, అక్టోబర్‌ 5న కాన్పూర్‌ వేదికగా జరుగనున్నాయి. టీమ్‌ఇండియా స్క్వాడ్ ఇదే శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్‌, ఎన్‌. జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురేల్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడికల్‌, హర్ష్‌ దూబే, ఆయుష్‌ బదోనీ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తనుష్‌ కోటియాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, ఖలీల్‌ అహ్మద్‌, మానవ్‌ సుతార్‌, యశ్‌ ఠాకూర్‌. రెండో అనధికారిక టెస్ట్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌, మహమ్మద్ సిరాజ్‌ స్క్వాడ్‌లో చేరతారు.