RCB: కోహ్లీ మా ఐకానిక్ స్టార్ : మో బోబాట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ)కి ఐకానిక్ హీరోగానే నిలుస్తాడని ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కచ్చితంగా ఐకానిక్ హీరో. అతడు మరో జట్టుకు వెళ్లే అవకాశమే లేదని నేను భావిస్తున్నాను. అతడి ట్రాక్ రికార్డు అసాధారణమని బోబాట్ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ చూపుతున్న నిలకడపై కూడా ఆయన ప్రశంసలు కురిపించాడు. "గత 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటికే 9,000 పరుగులకు చేరువయ్యాడు.
Details
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ సాధిస్తాం
ప్రతి సీజన్‌కు సగటున 500 పరుగులు సాధించడం అద్భుతమని వ్యాఖ్యానించాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ దృష్ట్యా తమ జట్టు మైండ్‌సెట్ ఎలా ఉండబోతోందో కూడా బోబాట్ వివరించాడు. "మేం డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు. మేం ఏదీ రక్షించుకోవాల్సిన అవసరం లేదు. మేం ప్రస్తుత ఛాంపియన్స్. డిఫెండ్ చేసే ఆలోచన కంటే దాడి మైండ్‌సెట్ మాకు ఇష్టం. బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ సాధించడమే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశాడు.