
RR vs KKR: రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా 17.3 ఓవర్లలో 2వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది.
క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్
కోల్‌కతా విజయంలో ప్రధాన భూమికను ఓపెనర్ క్వింటన్ డికాక్ (97: 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)* పోషించాడు.
తన మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. త్రుటిలో శతకాన్ని మిస్ అయినప్పటికీ జట్టుకు గెలుపును అందించాడు.
రఘువంశీ (22)*అతనికి తోడుగా నిలిచి అజేయంగా ఇన్నింగ్స్ ముగించాడు.రాజస్థాన్ బౌలర్లలో హసరంగ ఒకే ఒక్క వికెట్ తీశాడు.
వివరాలు
రాజస్థాన్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
కోల్‌కతా బౌలర్లు రాజస్థాన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంతో,పెద్ద స్కోరు చేయలేకపోయారు.
ధ్రువ్ జురెల్ (33; 28 బంతుల్లో 5 ఫోర్లు)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (13; 11 బంతుల్లో 2 ఫోర్లు)మొదటికే ఔటవ్వడంతో రాజస్థాన్‌కు గట్టిదెబ్బ తగిలింది.
కోల్‌కతా బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు.వరుణ్ చక్రవర్తి (2 వికెట్లు),మొయిన్ అలీ (2 వికెట్లు),వైభవ్ అరోరా (2 వికెట్లు),హర్షిత్ రాణా (2 వికెట్లు) కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కదలకుండా చేసేశారు. స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీశాడు.
వివరాలు
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో కీలక మలుపులు
రాజస్థాన్ మొదట్లో మంచి ఆరంభం చేసినప్పటికీ, స్పిన్నర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు.
జైస్వాల్, సంజు శాంసన్ తొలుత మెరుగైన భాగస్వామ్యం అందించినా, శాంసన్ ఔటైన తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.
వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లలో పరాగ్, హసరంగను వెనక్కి పంపాడు. మొయిన్ అలీ తన స్పిన్‌తో జైస్వాల్, నితీశ్ రాణాను పెవిలియన్‌కు పంపాడు.
వైభవ్ 15వ ఓవర్‌లో చివరి బంతికి శుభమ్ దూబెను ఔట్ చేశాడు. హర్షిత్ ఒకే ఓవర్‌లో ధ్రువ్ జురెల్, హెట్‌మయర్ (7)ను ఔట్ చేశాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌ను స్పెన్సర్ జాన్సన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
వివరాలు
కోల్‌కతా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం
152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా, డికాక్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ బౌలర్లను పూర్తిగా కట్టడి చేసింది.
హసరంగ ఒక్క వికెట్ తీసినప్పటికీ, ఇతర రాజస్థాన్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. ఈ విజయంతో ఐపీఎల్ 18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Q అంటే నాణ్యత.. Q అంటే క్వింటన్
Q for Quality, Q for Quinton 👌👌
— IndianPremierLeague (@IPL) March 26, 2025
A sensational unbeaten 9⃣7⃣ runs to seal the deal ✅
Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/kbjY1vbjNL