Kolkata Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 124 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో సుందర్ 31,అక్షర్ పటేల్ 26,జడేజా 18,జురెల్ 13 పరుగులు మాత్రమే సాధించారు. ప్రోటియాస్ బౌలర్లలో హార్మర్ నాలుగు వికెట్లతో రాణించగా,మార్కో జాన్సెన్ రెండు,కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. మార్‌క్రమ్ కూడా ఒక కీలక వికెట్‌ను దక్కించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా బయటకు వెళ్లిన శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలోకే రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో..దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు, భారత్ 189 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులు నమోదు చేసి భారత్‌కు చిన్న లక్ష్యాన్ని పెట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తొలి టెస్టులో భారత్ 30 రన్స్ తో ఓటమి
South Africa has defended the lowest total ever in India.
— LikhaPadhi (@likhapadhi_com) November 16, 2025
SA Won By 30 Runs Defending 124 at Eden Garden, Kolkata.
Historic.#INDvSA pic.twitter.com/6iLPCBsWre