
Korean Open 2023: పురుషుల డబుల్స్‌లో అదరగొట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ: కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది.
గత నెలలో ఇండోనేషియా ఓపెన్‌ని సొంతం చేసుకున్న ఈ జోడీ, తాజాగా కొరియా ఓపెన్‌ని కైవసం చేసుకుంది.
కొరియా ఓపెన్ ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ పయాన్ - మహమ్మద్ రియాన్ జోడోపీ 17-21, 21-13, 21-14 తేడాతో గెలుపొంది విజేతగా నిలిచారు.
పైనల్ పోరులో మొదటి మ్యాచులో ఓడిపోయిన సాత్విక్-చిరాగ్ జోడీ, రెండవ మ్యాచులో మూడవ మ్యాచులో గెలిచి విజేతగా నిలిచారు.
కొరియా ఓపెన్ విజేతగా నిలవడంతో తమ కెరీర్లో మూడవ BWF వరల్డ్ టూర్ సూపర్ 500 టైటిల్ గెలిచినట్లుగా అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩
— BAI Media (@BAI_Media) July 23, 2023
Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS