ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ లో తెలుగు అబ్బాయి
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. భారత్ క్రికెట్ బోర్డు మంగళవారం WTC ఫైనల్ జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టులోకి అజింక్యా రహానే తిరిగి రాగా.. కేఎస్ భరత్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. తొలిసారిగా టెస్టు క్రికెట్లో ఆరంగ్రేటం చేసిన భరత్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్ లను కూడా ఆడాడు. అయితే విదేశీగడ్డపై జరగనున్న ఈటోర్నీలో ఆడేందుకు తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు అవకాశం లభించింది. బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గాయపడటంతో సెకండ్ ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ గా భరత్ కు అవకాశం లభించింది.
జూన్ 7న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
జూన్ 7నుంచి 11వ తేదీ వరకూ జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులు ఆడిన భరత్ తొలి టెస్టులో ఓ క్యాచ్, ఓ స్టంపౌట్ చేశాడు. మిగిలిన మూడు మ్యాచ్ లో ఆరు క్యాచ్ లు పట్టాడు. అదే విధంగా బ్యాటింగ్ లో 101 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఆసాధారణ ప్రదర్శన చేసినప్పటికీ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో కేఎస్ భరత్ ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి.