LOADING...
 Kuldeep Yadav: ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన కుల్దీప్ యాద‌వ్
ఆసియాక‌ప్ లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన కుల్దీప్ యాద‌వ్

 Kuldeep Yadav: ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన కుల్దీప్ యాద‌వ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఆసియా కప్ చరిత్రలో భారత తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుధ‌వారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయ‌డం ద్వారా కుల్దీప్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు ర‌వీంద్ర జ‌డేజా పేరిట ఉండేది. జడేజా మొత్తం 29 వికెట్లు సాధించగా, కుల్దీప్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌తో కలిపి మొత్తం 31 వికెట్లు తీసాడు. ఫలితంగా అతను ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానం సంపాదించాడు. కుల్దీప్ కంటే ముందుగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ 33 వికెట్లు తీసి ఈ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.

వివరాలు 

ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు వీరే.. 

* కుల్దీప్ యాద‌వ్ - 31 వికెట్లు * ర‌వీంద్ర జ‌డేజా - 29 వికెట్లు * జ‌స్‌ప్రీత్ బుమ్రా - 23 వికెట్లు * ఇర్ఫాన్ ప‌ఠాన్ - 22 వికెట్లు * భువ‌నేశ్వ‌ర్ కుమార్ - 22 వికెట్లు ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే.. *ల‌సిత్ మ‌లింగ (శ్రీలంక‌) - 33 వికెట్లు *కుల్దీప్ యాద‌వ్ (భార‌త్‌) - 31 వికెట్లు *ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) - 30 వికెట్లు *ర‌వీంద్ర జ‌డేజా (భార‌త్‌)- 29 వికెట్లు * ష‌కీబ్ అల్ హ‌స‌న్ (బంగ్లాదేశ్‌) - 28 వికెట్లు

వివరాలు 

భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు

మ్యాచ్ విషయానికి వస్తే, భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ (75), హార్దిక్ పాండ్యా(38), శుభమన్ గిల్ (29) పరుగులతో రాణించడంతో మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు పొందగా,తంజిమ్ హసన్ సాకిబ్,ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ ఒక్కొక్క వికెట్ సాధించడంలో విజయవంతమయ్యారు.

వివరాలు 

127 పరుగులకే ఆలౌటైనా బాంగ్లాదేశ్

తదుపరి బాంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో సైఫ్ హసన్ (51 బంతుల్లో 69 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో బాంగ్లాదేశ్ 19.3 ఓవర్‌లలో 127 పరుగులకే ఆలౌటయ్యింది. భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తులు రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్,తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు.