విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించిన కున్లావుట్ విటిడ్ సర్న్
థాయ్ లాండ్ కు చెందిన కున్లావుట్ విటిడ్ సర్న్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డెన్నార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించి సత్తా చాటాడు. మాజీ ఇండియా ఓపెన్ విజేత అక్సెల్‌సెన్ 20-22, 21-10, 12-21 తేడాతో సత్తా చాటాడు. గతేడాది 29 ఏళ్ల పురుషుల సింగిల్స్‌లో ఒకే సీజన్‌లో ఏడు సూపర్ సిరీస్‌లు గెలిచిన తొలి కున్లావుట్ చరిత్రకెక్కాడు తొలి రౌండ్‌లో అక్సెల్‌సెన్ 21-14, 21-19తో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. R16లో చైనాకు చెందిన షి యుకిపై 21-16, 16-21, 21-9తో విజయం సాధించాడు.
ఆక్సెల్‌సెన్ సాధించిన రికార్డులివే
2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అక్సెల్‌సెన్ 18 BWF వరల్డ్ టూర్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఆరుసార్లు రన్నరప్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. డానిష్ ఏస్ 2022లో 51 మ్యాచ్‌లలో 48 గెలిచాడు. ఒకే సీజన్లో రికార్డు స్థాయిలో ఏడు సూపర్ సిరీస్‌లను గెలుచుకున్న వ్యక్తిగా సత్తా చాటాడు. గతంలో లిన్ డాన్, లీ చోంగ్ వీ, శ్రీకాంత్ పేరిట ఉన్న నాలుగు రికార్డులను బద్దలు కొట్టాడు. 2022 ఆక్సెల్‌సెన్‌కు గొప్ప సంవత్సరమని చెప్పొచ్చు. అదే సీజన్‌లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ టూర్ ఫైనల్స్‌లను గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు.