65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కైలియన్ ఎంబాపే
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే అరుదైన రికార్డును సాధించాడు. ఒకే సీజన్‌లో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అదే విధంగా పీఎస్‌జీ క్లబ్ తరుపున కూడా అతను టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
దీంతో 65 ఏళ్ల రికార్డును ఎంబాపే బ్రేక్ చేశాడు. ఈ సీజన్‌లో ఎంబాపే ఏకంగా 54 గోల్స్ చేసి చరిత్ర సృష్టించాడు. యూరో 2024 క్వాలిఫైయర్స్ మ్యాచులో ఈ అరుదైన ఘనతను అతను సాధించాడు.
గ్రీస్ తో జరిగిన మ్యాచులో 55వ నిమిషంలో పెనాల్టీని గోల్ పోస్ట్ లోకి పంపి 54వ గోల్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
Details
పీఎస్‌జీని వీడిన మెస్సీ
దివంగత స్ట్రైకర్ జస్ట్ ఫొంటేన్ పేరిట గతంలో ఈ రికార్డు ఉండేది. అతను 1957-58 లో ఓకే సీజన్లో 53 గోల్స్ చేసి అప్పట్లో రికార్డును నెలకొల్పాడు.
గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అత్యధికంగా 8 గోల్స్ కొట్టిన ఎంబాపేకు గోల్డన్ బూట్ అవార్డు వరించింది.
వరల్డ్ కప్ తర్వాత లియోనల్ మెస్సీ, నెయ్‌మర్ జూనిరయర్, ఎంబాపే పీఎస్‌జీ తరఫున సౌదీ అరేబియా లీగ్‌లో ఆడారు. ఈ మధ్యే పీఎస్‌జీ ని మెస్సీ వీడాడు.