Loading...
Nayanthara: ప్రమోషన్లకు నో చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయన్ దూరం!
ప్రమోషన్లకు నో చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయన్ దూరం!

Nayanthara: ప్రమోషన్లకు నో చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయన్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె ఈ పద్ధతికి భిన్నంగా వ్యవహరించడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో పాటు, ఆ తర్వాత 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ సందడి చేశారు. దీంతో ఇకపై నయనతార కూడా తన సినిమాల ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని అభిమానులు భావించారు. కానీ తాజాగా ఆమె మరోసారి తన పాత పద్ధతినే కొనసాగించారు. తన కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయనతార హాజరుకాలేదు.

వివరాలు

రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో 'మూకుత్తి అమ్మన్ 2'

దీంతో ఆమె మరోసారి సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై చర్చ మొదలైంది.

కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో 'మూకుత్తి అమ్మన్ 2' ఒకటి. సుమారు రూ.100కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెజీనా కసాండ్రా ప్రతినాయకురాలిగా కనిపించనున్నారు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో జోరుగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయనతార కూడా హాజరుకాకపోవడంతో కార్యక్రమం అంతంతమాత్రంగానే సాగిందనే చర్చ జరుగుతోంది.

వివరాలు

ఈవెంట్‌కు నయనతార ఎందుకు రాలేదంటే?

'మూకుత్తి అమ్మన్ 2'కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న నయనతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎందుకు హాజరుకాలేదనే విషయంపై అభిమానులు ఆరా తీశారు.

అయితే ఆమె గైర్హాజరుకు గల కారణాన్ని చిత్ర బృందం వెల్లడించింది. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే నయనతార ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపింది.

ఇదిలా ఉంటే.. సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార నాన్‌వెజ్‌కు దూరంగా ఉన్నారని దర్శకుడు సుందర్ వెల్లడించారు.

పాత్ర పట్ల, సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

దీంతో ప్రమోషన్లకు ఆమె దూరంగా ఉన్నప్పటికీ, సినిమా కోసం నయనతార ఎంతటి అంకితభావంతో పనిచేశారనే అంశం మరోసారి చర్చకు వచ్చింది.

ADVERTISEMENT