
Lakshyasen : సంచలన రికార్డు.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో చెలరేగిపోతున్నాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీ బ్యాడ్మింటన్ ప్లేయర్ చౌ టియన్-చెన్‌ను ఓడించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ ఉత్కంఠంగా సాగినా అనుకున్న ఫలితం రాలేదు.
ఇక మిగిలిన రెండు గేమ్ ల్లో మాత్రం చెన్‌ను వణుకు పుట్టించాడు. 1
9-21, 21-15, 21-12 పాయింట్ల తేడాతో లక్ష్యసేన్ గెలుపొందాడు.
Details
తొలి భారత పురుష షట్లర్ గా లక్ష్యసేన్ రికార్డు
ఒత్తిడికి లోనూ కాకుండా సేన్ ప్రత్యర్థిని ఓడించగలిగాడు.
లక్ష్య సేన్ ఈ విజయంతో సెమీ ఫైనల్ కు చేరిన తొలి భారత పురుషు సింగిల్స్ షట్లర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
ఇప్పటిదాకా జరిగిన పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ మాత్రమే ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ దాకా వెళ్లారు.
మహిళల విభాంలో సైనా నెహ్వాల్, పివి. సింధు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.