Ruthraj gaikwad: కెప్టెన్సీపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ స్థానంలో రుతురాజ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఈ క్రమంలో తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు."గత సంవత్సరమే మహీ భాయ్ నాకు కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చారు. సిద్ధంగా ఉండు..నీకిది సర్‌ప్రైజ్‌గా ఉండకూడదు అని చెప్పారు.నేను క్యాంప్‌లో జాయిన్ అయినప్పుడు మ్యాచ్ ప్రణాళికలపై సూచనలు చేశారు.కెప్టెన్ చేయాలని ఆయన ముందే అనుకున్నారు. కానీ,ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారం క్రితం నాతో చెప్పారు'అని తెలిపారు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై ఎంఎస్ ధోని మూడు వారాల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
కొత్త రోల్‌తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గత IPLలోనే ధోనీ నాకు హింట్ ఇచ్చారు: గైక్వాడ్
#Gaikwad: Last year itself, Dhoni had hinted about captaincy #"Last year itself, Mahi bhai had hinted ... - https://t.co/X4EspCSQKc
— IndianPremierLeague (@CricketT20IPL) March 22, 2024