LOADING...
యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్
2023 Yamaha Aerox 155 24.5 లీటర్లు కొలిచే అండర్-సీట్ స్టోరేజీని కలిగి ఉంది

యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర ధర రూ. 1,42,800 ఉండనుంది. ఈ వాహనం ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో రానుంది. దీంతో రైడర్‌లకు మరింత భద్రతను పెంచనుంది. 14.8hp అవుట్‌పుట్ ఉత్పత్తి చేసే 155 సీసీ మోటార్ బైక్ సరికొత్త ఫీచర్లతో ముందుకొచ్చింది. యమహా ఏరోక్స్ 155 బైక్‌కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందిన విభాగంలో ఇది మొదటి బైక్ కావడం విశేషం. స్కూటర్‌లో ముందువైపున LED హెడ్‌లైట్లు, అద్దాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

యమహా

ఢిల్లీ షోరూంలో అందుబాటులో యమహా ఏరోక్స్ 155 లాంచ్

ముందు పవర్ సాకెట్, బ్లూటూత్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హజార్డ్ ల్యాంప్స్, స్టెప్-అప్ సీట్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఉండనున్నాయి. ఈ బైక్ ముందు చక్రంలో 230mm డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130mm డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. ఈ వాహనానికి OBD-2 సిస్టమ్, E20 ఇంధనానికి అనుగుణంగా ఉండనుంది. ఈ వాహనం ప్రస్తుతం ఢిల్లీ షోరూంలో అందుబాటులో ఉంది.