ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్
NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్‌తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్‌లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు. మూడో క్వార్టర్‌లో రెండు పాయింట్లతో మైలురాయికి చేరుకున్న జేమ్స్ ఇప్పుడు 38,390 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. లెజెండ్ అబ్దుల్-జబ్బార్ 38,387 పాయింట్లతో తన తర్వాతి స్థానంలో నిలిచాడు. అబ్దుల్-జబ్బార్ 1560 మ్యాచ్‌ల్లో 38,387 పాయింట్లను సాధించడం గమనార్హం. NBA చరిత్రలో మరే ఇతర ఆటగాడు 35,000 కంటే ఎక్కువ పాయింట్లను సేకరించక పోవడం విశేషం.
నాలుగుసార్లు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచిన లెబ్రాన్
కరీం వంటి గొప్ప లెజెండ్ సరసన చేయడం సంతోషంగా ఉందని జేమ్స్ అన్నాడు. లెబ్రాన్ NBA ఛాంపియన్ లో 2012, 2013, 2016, 2020 నాలుగుసార్లు ఎంపికయ్యాడు. 2009, 2010, 2012, 2013లో NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. మూడు ఫ్రాంచైజీలతో NBA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న నలుగురు ఆటగాళ్లలో లెబ్రాన్ ఒకడు .లెబ్రాన్ NBA చరిత్రలో 10,000 కంటే ఎక్కువ కెరీర్ పాయింట్లు, రీబౌండ్‌లు, అసిస్ట్‌లను సాధించిన మొదటి, ఏకైక ఆటగాడిగా నిలిచాడు.