Page Loader
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 

Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 

వ్రాసిన వారు Stalin
Mar 25, 2024
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో జట్టు పంజాబ్ తో పోరుకు సిద్దమైంది. చెన్నైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులు విజేతలుగా నిలిచిన జట్ల సొంత మైదానాల్లోనే జరగడం విశేషం. అయితే ఈ రోజు బెంగళూరు - పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హోమ్‌ గ్రౌండ్‌లో విక్టరీ ఆనవాయితీని బెంగళూరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి! ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై జట్టుతో జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సరిగ్గా ప్రదర్శన చేయలేకపోయింది.

చెన్నై తో బెంగళూరు తొలి మ్యాచ్ విశ్లేషణ

చెన్నై తో బెంగళూరు తొలి మ్యాచ్ విశ్లేషణ

స్టార్‌ విరాట్ కోహ్లీ తన దూకుడు చూపలేదు. కెప్టెన్ డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్, అనుజ్‌ రావత్ రాణించడంతో చెన్నై మ్యాచ్ 170+ స్కోరు చేయగలిగింది. కామెరూన్ గ్రీన్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఆసీస్‌ను ప్రపంచ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన "గ్లెన్ మ్యాక్స్‌వెల్" (0) తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు 84 మ్యాచ్‌లు ఆడితే 39 మ్యాచుల్లో గెలిచింది, 40 మ్యాచుల్లో ఓడింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. బౌలింగ్‌ లో మెరుగుదల అవసరం. సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌, కామెరూన్ గ్రీన్, కర్ణ్‌ శర్మ, యశ్‌ దయాల్ భారీగా పరుగులు సమర్పించకుండా ఉంటే ఫలితం ఉంటుంది.

ఢిల్లీతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్ విశ్లేషణ ... 

ఢిల్లీతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్ విశ్లేషణ 

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఒక దశలో ఓటమి దిశగా సాగింది, కానీ సామ్‌కరన్ (63), లివింగ్‌స్టోన్ (38) కీలకపాత్ర ద్వారా ఇన్నింగ్స్‌తో గట్టెక్కారు. గడిచిన రెండు సీజన్ల నుంచి విఫలమవుతున్న కరన్‌ మళ్ళీ ఊపందుకోవటం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడిన భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇక మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన జానీ బెయిర్‌ స్టో (9)కి మ్యాచ్ కలిసిరాలేదు. కొత్త వైస్‌ కెప్టెన్‌ జితేశ్ శర్మ తేలిపోయాడు. దాదాపు రూ.11 కోట్లతో దక్కించుకున్న హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన చేయలేదు.