LOADING...
Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో 
మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో

Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025' కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటనగా భారతదేశాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మెస్సీ పలువురు ప్రముఖులతో సమావేశమవడంతో పాటు, అభిమానులతో సంభాషించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి.

వివరాలు 

హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం.. 

13వ తేదీ నాడు కోల్‌కతా పర్యటన ముగించుకుని మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి 7v7 ఫుట్‌బాల్ మ్యాచ్ లో పాల్గొనబోతున్నారు. ఈ మ్యాచ్ అనంతరం,మెస్సీ గౌరవార్థం ప్రత్యేకంగా ఒక సంగీత విభావరి కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇతర నగరాల్లో షెడ్యూల్ ఇదే.. కోల్‌కతాలో మెస్సీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ,బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ లతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముంబైలో జరిగే ఈవెంట్లలో మెస్సీతో పాటు అతని సన్నిహిత ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా హాజరవనున్నారని టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా పీటీఐకి వెల్లడించారు.

వివరాలు 

టికెట్ వివరాలు 

అక్కడ సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, చారిటీ ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. పర్యటన చివరి రోజు న్యూఢిల్లీలో మెస్సీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ టూర్‌కు సంబంధించిన టికెట్లు 'డిస్ట్రిక్ట్ యాప్' ద్వారా విక్రయిస్తున్నారు. చాలావరకు నగరాల్లో టికెట్ ధరలు ₹4,500 నుంచి ప్రారంభమవుతుండగా, ముంబైలో మాత్రం కనీస ధర ₹8,250 నుంచి మొదలవుతోంది. 2011లో అర్జెంటీనా జట్టుతో కలిసి కోల్‌కతాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత, మెస్సీ ఎంతో కాలం తర్వాత భారత్‌కు వస్తుండటం ఇదే మొదటిసారి.

Advertisement

వివరాలు 

మెస్సీ టూర్ పూర్తి షెడ్యూల్ ఇలా... 

13న‌ కోల్‌కతాలో.. ఉదయం 1:30 గంటలకు కోల్‌కతాకు రాక‌ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు: మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 11:15 వరకు: మెస్సీ విగ్రహం ప్రారంభోత్సవం (వర్చువల్‌గా) ఉదయం 11:15 నుంచి 11:25 వరకు: యువ భారతికి రాక ఉదయం 11:30 గంటలకు: షారుఖ్ ఖాన్ యువభారతికి రాక‌ మధ్యాహ్నం 12:00 గంటలకు: స్టేడియంకు చేరుకోనున్న‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 వరకు: స్నేహపూర్వక మ్యాచ్, సత్కారం మధ్యాహ్నం 2:00 గంటలకు: హైదరాబాద్ కు ప‌య‌నం

Advertisement

వివరాలు 

13న‌ హైదరాబాద్‌లో.. 

రాత్రి 7:00 గంటలకు: రాజీవ్ గాంధీ స్టేడియంలో 7v7 మ్యాచ్. మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య. ఆ సాయంత్రం సంగీత కచేరీ కూడా ఉంటుంది.

వివరాలు 

14న ముంబైలో.. 

మధ్యాహ్నం 3:30 గంటలకు: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పాడెల్ కప్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు: సెలబ్రిటీల ఫుట్‌బాల్ మ్యాచ్ సాయంత్రం 5:00 గంటలకు: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, తరువాత ఛారిటీ ఫ్యాషన్ షో. 15న‌ న్యూఢిల్లీలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం మధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో మినర్వా అకాడమీ ఆటగాళ్లను సత్కరించే కార్యక్రమం.

Advertisement