తదుపరి వార్తా కథనం

Lionel Messi : అద్భుత గోల్‌తో మెరిసిన మెస్సీ.. ఏకంగా 30 గజాల దూరం నుంచి!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 16, 2023
11:59 am
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత గోల్‌తో మెరిశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ నమోదు చేసి అభిమానులను అశ్చర్యపరిచాడు.
ఇంటర్ మియామి క్లబ్ తరుపున ఆడుతున్న మెస్సీ, ఫిలడెల్ఫియా యూనియన్ క్లబ్ పై ఓ గోల్ చేశాడు. దీంతో మియామి జట్టు 4-1 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఆట 20వ నిమిషంలో 30 గజాల దూరం నుంచి గోల్ చేసి సత్తా చాటాడు. ఈ లీగ్ లో ఆరు మ్యాచులు ఆడిన మెస్సీ 9 గోల్స్ చేయడం విశేషం.
మియామి జట్టు తరపున జోసెఫ్ మార్టినేజ్, జోర్డి ఆల్బా, డేవిడ్ రూయిజ్ గోల్స్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
30 గజాల దూరం నుంచి గోల్ కొట్టిన మెస్సి
This angle of Lionel Messi's goal for Inter Miami. 🔥pic.twitter.com/jpgW8y1Kji
— Roy Nemer (@RoyNemer) August 16, 2023
మీరు పూర్తి చేశారు