Page Loader
2023 ఐపీఎల్‌లో రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే
రోహిత్‌శర్మ ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిళ్లను అందించాడు

2023 ఐపీఎల్‌లో రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఈ ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ని 5 సార్లు టోర్నీ విజేతగా నిలపడటంతో రోహిత్ సక్సస్ అయ్యాడు. రోహిత్ 227 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.30 సగటుతో 5,879 పరుగులు చేశాడు. ఇందులో 40 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అత్యధికంగా 109 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ కంటే ముందు పరుగులు పరంగా కోహ్లీ (6,624), శిఖర్‌ధావన్ (6,244) ముందు ఉన్నారు. ఐపీఎల్‌లో 6,000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి రోహిత్ కేవలం 121 పరుగుల దూరంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ

అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

2011 సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేరిన రోహిత్ 182 మ్యాచ్‌లు 4,709 పరుగులు చేశాడు. ముంబై తరుపున 5,000 పరుగులు పూర్తి చేయడానికి అతనికి 291 పరుగులు అవసరం. విరాట్ కోహ్లీ మాత్రమే రాయల్స్ ఛాలెంజర్స్ తరుపున 5వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడానికి ఏడు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండే రోహిత్ 100 క్యాచ్‌ల మార్కును దాటడానికి మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్నాడు. సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) మాత్రమే వంద క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నారు.