Page Loader
రియల్ మాడ్రిడ్ చేతిలో లివర్‌పూల్‌పై ఓటమి
లివర్‌పూల్ 2-5 తేడాతో ఓడిపోయింది

రియల్ మాడ్రిడ్ చేతిలో లివర్‌పూల్‌పై ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్‌లో లివర్‌పూల్‌ ఓటమిపాలైంది. రియల్ మాడ్రిడ్ చేతిలో 5-2తేడాతో లివర్‌పూల్ ఓడిపోయింది. లివర్‌పూల్ తరుపున డార్విన్ నునెజ్ అదరిపోయే అరంభాన్ని అందించాడు. తర్వాత మొహమ్మద్ సలా మరోసారి అధిక్యంలో నింపాడు. అయితే రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు విజృంభించడంతో గెలుపు సాధ్యమైంది. లివర్‌పూల్ యాన్‌ఫీల్డ్‌లో ఐదు గోల్స్ చేయడం గమనార్హం. రియల్ మాడ్రిడ్ వరుసగా ఛాంపియన్స్ లీగ్ గేమ్‌లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన జట్టుగా రెండోసారి నిలిచింది.

బెంజెమా

లివర్‌పూల్‌పై ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా బెంజెమా

రియల్ మాడ్రిడ్ యూరోపియన్ పోటీల చరిత్రలో ఐదు గోల్స్ చేసిన రెండవ జట్టుగా అర్హత సాధించింది. బెంజెమా యూరోపియన్ కప్, ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో లివర్‌పూల్‌పై ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను యాన్ఫీల్డ్‌లో నాలుగు గోల్స్ చేశాడు. ఈ సీజన్‌లో జరిగిన ఐదు ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లలో బెంజెమా రెండు గోల్స్ చేసి సత్తా చాటాడు. బాలన్ డిఓర్ విజేత ఈ సీజన్‌లో అన్ని పోటీలలో రియల్ మాడ్రిడ్ కోసం 17 గోల్స్ చేయడం విశేషం.