LOADING...
IPL 2026: ఐపీఎల్ 2026కి ముందు లక్నో సంచలన నిర్ణయం.. జాంటీ రోడ్స్‌కు గుడ్‌బై.. అభయ్ శర్మకు ఫీల్డింగ్ బాధ్యతలు
జాంటీ రోడ్స్‌కు గుడ్‌బై.. అభయ్ శర్మకు ఫీల్డింగ్ బాధ్యతలు

IPL 2026: ఐపీఎల్ 2026కి ముందు లక్నో సంచలన నిర్ణయం.. జాంటీ రోడ్స్‌కు గుడ్‌బై.. అభయ్ శర్మకు ఫీల్డింగ్ బాధ్యతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) జట్టు ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన జాంటీ రోడ్స్(Jonty Rhodes) స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మ(Abhay Sharma)ను నియమించింది. రోడ్స్‌ స్వచ్ఛందంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు సమాచారం. గత సీజన్‌లో ఫీల్డింగ్‌ విభాగంలో లక్నో ప్రదర్శన తీవ్ర నిరాశ కలిగించింది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలేయడం,రనౌట్లు మిస్‌ చేయడం వంటి తప్పిదాలు వరుసగా జరిగాయి. మిస్‌ ఫీల్డింగ్‌ కారణంగా ప్రత్యర్థి జట్లు అదనపు పరుగులు సాధించాయి.ఈ లోపాల వల్ల కొన్ని కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు భారీ నష్టం చవిచూసింది. దీంతో మేనేజ్‌మెంట్‌ కఠిన నిర్ణయం తీసుకుని రోడ్స్‌ను తప్పించింది.

వివరాలు 

కోచింగ్‌ అనుభవం

గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్నరిషబ్ పంత్ (Rishabh Pant) నేతృత్వంలో లక్నో కేవలం ఆరు విజయాలకే పరిమితమై, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో యాజమాన్యం పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. జట్టు లోగోతో పాటు జెర్సీ డిజైన్‌ను కూడా కొత్త రూపంలో తీసుకొచ్చింది. అభయ్ శర్మ 2024లో ఉగాండా జట్టును తొలిసారిగా ICC Men's T20 World Cupకు అర్హత సాధించేలా చేసి గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో సంపాదించిన అనుభవాన్ని ఇప్పుడు లక్నో జట్టుకు అందించనున్నారు. 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేసిన ఆయన, Shubman Gill, Prithvi Shaw, Arshdeep Singh వంటి యువ తారల ఎదుగుదలకు తోడ్పడ్డాడు.

వివరాలు 

ఆటగాడిగా ప్రస్థానం

వికెట్‌కీపర్‌గా అనుభవం ఉన్న అభయ్ శర్మ,Rishabh Pant, Dhruv Jurel, Yashasvi Jaiswal, Sarfaraz Khan వంటి ఆటగాళ్లకు మార్గదర్శకత్వం అందించాడు. అదనంగా భారత మహిళా జట్టుకు కూడా కోచ్‌గా సేవలందించి తన అనుభవాన్ని విస్తరించాడు. అభయ్‌ కోచింగ్‌కు ముందు భారత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల తరఫున మొత్తం 129 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్‌ క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడి 4105 పరుగులు సాధించాడు. ఇందులో 9 శతకాలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో 40 మ్యాచ్‌లు ఆడి 780 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధశతకం నమోదు చేశాడు. వికెట్‌కీపర్‌గా మొత్తం 210 డిస్మిసల్స్‌ నమోదు చేశాడు.వాటిలో 165 క్యాచ్‌లు, 45 స్టంపింగ్స్‌ ఉన్నాయి.

Advertisement