Page Loader
IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్ 
135 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్

IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 66(50),వృద్ధిమాన్ సాహా47(37)పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్టోయినిస్ రెండు వికెట్లతో చెలరేగడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

Details

కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లక్నో బౌలర్లు

గుజరాత్ టైటాన్స్ కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 4 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. శుభ్ మాన్ గిల్ (0) డకౌట్ తో వెనుతిరిగాడు. మంచి ఊపు మీద ఉన్న వృద్ధిమాన్ సాహా, కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ కావడంతో గుజరాత్ 75 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాతి వచ్చిన బ్యాట్స్ మెన్స్ నెమ్మదిగా ఆడటంతో గుజరాత్ చెప్పుకోదగ్గ స్కోరును చేయలేకపోయింది. హార్ధిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హాక్‌ (4-0-19-1), కృనాల్‌ పాండ్యా (4-0-16-2) స్టోయినిస్‌ (3-0-20-2), అమిత్‌ మిశ్రా (2-0-9-1) సత్తా చాటారు