
LSG vs SRH: బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. సన్ రైజర్స్ ఘోర ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌జెయింట్స్ బోణీ కొట్టింది.
ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో లక్నో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
సన్ రైజర్స్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే చేధించింది.
నికోలస్ పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు(6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చేలరేగడంతో ఆ జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది.
పూరన్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం.
ఇక మిచెల్ మార్స్ 31 బంతుల్లో 52 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ రెండు, మహ్మద్ షమీ, అడమ్ జంపా, హర్షద్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.
Details
నాలుగు వికెట్లు తీసిన శార్దుల్ ఠాకూర్
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36) ఫర్వాలేదనిపించారు.
వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0) ఔట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది.
చివర్లో పాట్ కమిన్స్ 4 బంతుల్లో 18 పరుగులు, క్లాసిన్ 17 బంతుల్లో 27 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 190 పరుగుల మార్కును దాటింది.
లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్ల పడగొట్టి సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదు వికెట్ల తేడాతో లక్నో గెలుపు
Match 7. Lucknow Super Giants Won by 5 Wicket(s) https://t.co/X6vyVEvxwz #SRHvLSG #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) March 27, 2025
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిచెల్ మార్స్ హాఫ్ సెంచరీ
Mitchell Marsh 52(31) 🔥🔥 pic.twitter.com/JPWNRhMQ25
— Daddyscore (@daddyscore) March 27, 2025