Loading...
IPL 2027 Retention List: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు భారీ మార్పులు.. ఏ ఆటగాడు ఏ జట్టుకు వెళ్లాడంటే?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు భారీ మార్పులు.. ఏ ఆటగాడు ఏ జట్టుకు వెళ్లాడంటే?

IPL 2027 Retention List: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు భారీ మార్పులు.. ఏ ఆటగాడు ఏ జట్టుకు వెళ్లాడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు చేస్తున్నాయి. డిసెంబర్‌లో గోవా వేదికగా మినీ వేలం జరగనుండగా.. నేడు (నవంబర్ 17) అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక ట్రేడ్స్ చోటుచేసుకున్నాయి. అయితే రిటెన్షన్ గడువు ముగిసిన తర్వాత కూడా ట్రేడింగ్ విండో కొనసాగనుంది. వేలానికి వారం రోజుల ముందు వరకు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను అటూ ఇటూ మార్చుకునే అవకాశం ఉంది.

వివరాలు

రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్ జట్లు మార్పు

2026 సీజన్ ముగిసిన తర్వాత తొలి కీలక ట్రేడ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది.

రిషభ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారగా.. కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నో జట్టులో చేరాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గతంలో రూ.27 కోట్లు అందుకున్న పంత్.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.15 కోట్లకు మారాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్‌కు రూ.13.50 కోట్ల ధర ఖరారైంది.

వివరాలు

సన్‌రైజర్స్, ఢిల్లీ మధ్య మరో ట్రేడ్

రెండో ట్రేడ్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది.

ఢిల్లీ జట్టులో ఉన్న పేసర్ నటరాజన్ సన్‌రైజర్స్‌లో చేరగా.. హైదరాబాద్ ఆటగాడు జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వచ్చాడు.

గతంలో నటరాజన్ రూ.10.75 కోట్లు అందుకోగా.. తాజా ట్రేడ్‌లో అతడి ధర రూ.5 కోట్లకు తగ్గింది. అయితే జీషన్ అన్సారీ జీతంలో ఎలాంటి మార్పు లేదు.

ADVERTISEMENT

వివరాలు

చెన్నై, హైదరాబాద్ మధ్య నలుగురు ఆటగాళ్ల మార్పిడి

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో కీలక ట్రేడ్ జరిగింది.

ఈ ఒప్పందంలో భాగంగా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులో చేరారు. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టుకు మారారు.

లివింగ్‌స్టోన్ గతంలో రూ.13 కోట్లు అందుకోగా.. ఇప్పుడు రూ.6 కోట్లకు చెన్నైలో చేరాడు. జాక్ ఎడ్వర్డ్స్ జీతం రూ.3 కోట్లుగానే కొనసాగనుంది.

మరోవైపు ఖలీల్ అహ్మద్‌కు రూ.4.8 కోట్లు, నాథన్ ఎల్లిస్‌కు రూ.2 కోట్ల వేతనంలో ఎలాంటి మార్పు లేదు.

ADVERTISEMENT

వివరాలు

హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ట్రేడ్

ఇప్పటివరకు అత్యంత చర్చనీయాంశంగా మారిన ట్రేడ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌లో చేరగా.. పంజాబ్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వచ్చాడు.

హార్దిక్ గతంలో రూ.16.35 కోట్లు అందుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18 కోట్లకు తీసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ కూడా రూ.18 కోట్ల వేతనంతోనే కొనసాగనున్నాడు.

ఇలా ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే పలు ఫ్రాంచైజీల మధ్య కీలక ఆటగాళ్ల మార్పిడి జరిగినట్లు సమాచారం.

నేడు రిటెన్షన్ జాబితాలు విడుదలైన తర్వాత మరిన్ని ట్రేడ్స్ జరిగే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT