Loading...
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. రోహిత్‌, కోహ్లీపై గిల్‌ కీలక వ్యాఖ్యలు!
టీమిండియాలో భారీ మార్పులు.. రోహిత్‌, కోహ్లీపై గిల్‌ కీలక వ్యాఖ్యలు!

Team India: టీమిండియాలో భారీ మార్పులు.. రోహిత్‌, కోహ్లీపై గిల్‌ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంతో వరుసగా ఆరు మ్యాచ్‌ల ఓటముల పరంపరకు టీమిండియా తెరదించింది. ఇందుకు ముందు భారత్‌ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-4తో, అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో కోల్పోయి తీవ్ర నిరాశకు గురైంది. అయితే సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అనుభవం, సమతూకం పెరిగి తొలి వన్డేలోనే ఫలితం కనిపించింది.

వివరాలు

2027 వన్డే ప్రపంచకప్‌నే లక్ష్యంగా పెట్టుకున్నాం

విజయం అనంతరం కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడుతూ జట్టు భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాడు.

ప్రస్తుతం కేవలం సిరీస్‌ విజయాలకే కాకుండా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామని తెలిపాడు.

ఆ టోర్నీకి అత్యుత్తమ జట్టును సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని గిల్‌ స్పష్టం చేశాడు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో జట్టు లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయని చెప్పాడు.

వివరాలు

రోహిత్‌, కోహ్లీ విఫలమైనా జట్టుపై పూర్తి నమ్మకం

తొలి వన్డేలో టాప్‌ ఆర్డర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్‌ శర్మ 11 పరుగులకే అవుట్‌ కాగా, విరాట్‌ కోహ్లీ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ఒక ఫోర్‌ కొట్టిన తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఐదు పరుగులకే వెనుదిరిగాడు.

అయితే మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను ముగించడం తనకు కెప్టెన్‌గా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని గిల్‌ అన్నాడు.

టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ పరుగులు చేసి మ్యాచ్‌లు గెలిపిస్తే జట్టుపై నమ్మకం మరింత పెరుగుతుంది.

మా బ్యాటింగ్‌ లైనప్‌పై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే లక్ష్యం 320 పరుగులైనా ముందుగా బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని గిల్‌ పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

సౌతాఫ్రికా ప్రపంచకప్‌కు ఉపయోగపడతాయి

2027 వన్డే ప్రపంచకప్‌ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు తమకు మంచి సన్నాహకంగా ఉపయోగపడుతున్నాయని గిల్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక్కడి పిచ్‌లు, వాతావరణం చాలా వరకు సౌతాఫ్రికాను గుర్తు చేస్తున్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్‌ చేయడం కష్టమే. బంతి బాగా మూవ్‌ అవుతుంది.

కానీ మ్యాచ్‌ ముందుకు సాగేకొద్దీ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వివిధ కాంబినేషన్లను పరీక్షించడం భవిష్యత్తులో మాకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించాడు.

ADVERTISEMENT

వివరాలు

ఆటగాళ్ల రొటేషన్‌పై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం, 2027 ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించేందుకు బీసీసీఐ ప్రత్యేక రొటేషన్‌ పాలసీని అమలు చేయాలని భావిస్తోంది.

ఈ విధానంలో భాగంగా కీలక ఆటగాళ్లకు అవసరమైనప్పుడు విశ్రాంతి ఇస్తూ, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించనున్నారు.

భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నీల కోసం బలమైన బెంచ్‌ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ADVERTISEMENT