
Mallika Sagar: ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 మెగా వేలం మొదటి రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.
జెడ్డా వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అయితే ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా మల్లిక సాగర్ నిలిచింది.
ముంబయికి చెందిన మల్లిక సాగర్ ఒక ప్రముఖ ఆర్ట్ కలెక్టర్‌గా, సమకాలీన భారతీయ కళాకృతుల కన్సల్టెంట్‌గా పేరు పొందారు.
49 ఏళ్ల మల్లిక క్రిస్టీస్ అనే అంతర్జాతీయ ప్రఖ్యాత ఆక్షన్ హౌస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు.
2001లో న్యూయార్క్‌లో జరిగిన మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం ద్వారా ఆమె తొలిసారి ప్రధాన వేదికపై కనిపించారు.
Details
తొలి మహిళ ఆక్షనీర్ గా గుర్తింపు
భారతీయ సంతతికి చెందిన తొలి మహిళా ఆక్షనీర్‌గా ఆమె గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
మల్లిక సాగర్ ముంబయి వేదికగా పలు విశేష కార్యక్రమాలను నిర్వహించారు.
ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్ సంస్థ భాగస్వామిగా ఆమె ఎన్నో అరుదైన కళాకృతుల వేలం ప్రక్రియలను విజయవంతంగా చేపట్టింది.