Page Loader
ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ
మాంచెస్టర్ సిటీ తరుపున గోల్ చేసిన నాథన్ అకే

ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2023
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ జట్టు పరాజయం పాలైంది. నాల్గవ రౌండ్ లో 1-0తో ఆర్సెనల్ ను మాంచెస్టర్ సిటీ ఓడించింది. సిటీ తరుపున నాథన్ అకే ఒకే ఒక గోల్ చేయడం గమనార్హం. మొదటి అర్ధభాగంలో సిటీ చేతిలో బంతిని ఎక్కువగా ఉంది. అర్సెనల్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ప్రస్తుతం మాంచెస్టర్ సిటీ ఐదో రౌండ్‌కు అర్హత సాధించింది. లియాండ్రో ట్రాసార్డ్ మొదటి అర్ధభాగంలో ఒర్టెగాను ఎదుర్కొన్నాడు. ఇంతలో సిటీ లక్ష్యానికి దగ్గరగా వెళ్లినా గోల్ చేయడంలో విఫలమైంది.

ఎర్లింగ్ హాలాండ్

సిటీ తరపున 31 గోల్స్ చేసి సత్తా చాటిన ఎర్లింగ్ హాలాండ్

ఎర్లింగ్ హాలాండ్ మ్యాన్ సిటీలో చేరినప్పటి నుంచి మూడు హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడాడు. ఇందులో స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో 2022-23 సీజన్‌లో సిటీ తరపున 31 గోల్స్ చేసి సత్తా చాటాడు. ఒక్క ప్రీమియర్ లీగ్‌లోనే 25 గోల్స్ చేసి చరిత్రకెక్కాడు. మ్యాన్ సిటీ మొదటిసారి FA కప్‌లో ఆర్సెనల్‌ను ఓడించడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు FA కప్‌లో గన్నర్స్‌తో జరిగిన నాలుగు వరుస గేమ్‌లలో సిటీ ఓడిపోయిన విషయం తెలిసిందే.