Page Loader
డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్
ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన మ్యాచ్

డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్‌కౌంటర్‌లో మేనేజర్‌లెస్ లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మంచెస్టర్ యునైటెడ్ రెండు గోల్స్‌తో చేయడంతో మ్యాచ్ 2-2 డ్రాగా నిలిచింది. విల్ఫ్రైడ్ గ్నోంటో లీడ్స్‌కు మొదటి నిమిషంలో ఆధిక్యాన్ని అందించగా.. సెకంఢాప్ ఫ్రారంభంలో రాఫెల్ వరాన్ సొంతంగా గోల్ చేయడంతో లీడ్స్‌కు ఊపు వచ్చింది. మ్యాన్ యునైటెడ్ 24 ప్రయత్నాలను చేయగా.. 7సార్లు లక్ష్యాన్ని చేరుకుంది. లీడ్స్ 8సార్లు ప్రయత్నాలు చేయగా.. రెండుసార్లు లక్ష్యాన్ని చేధించింది.

రాష్‌ఫోర్డ్

113 గోల్స్ చేసిన రాష్‌ఫోర్డ్

ఆతిథ్య యునైటెడ్ 66శాతం బాల్ స్వాధీనం చేసుకోగా.. 81శాతం పాస్ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. లీడ్స్ ఐదు కార్నర్‌లతో పోలిస్తే యునైటెడ్ ఆరు కార్నర్‌లను సాధించడం విశేషం. 22 మ్యాచ్‌ల తర్వాత యునైటెడ్ 43 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది లీడ్స్ 23 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లు సాధించి 16వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2012లో వేన్ రూనీ తర్వాత ప్రీమియర్ లీగ్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లలో స్కోర్ చేసిన ఆటగాడిగా మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు రాష్‌ఫోర్డ్ నిలిచాడు. రాష్‌ఫోర్డ్ 226వ పీఎల్ ప్రదర్శనను చేసి తన 70వ గోల్ చేశాడు. అయితే ఈ సీజన్లో 11 పీఎల్ గోల్స్ చేసి సత్తా చాటాడు. మొత్తం 113 గోల్స్ సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు.