Page Loader
న్యూకాజిల్‌తో పోరుకు సిద్ధమైన మాంచెస్టర్ యునైటెడ్
5-0తేడాతో గెలుపొందిన రెడ్ డెవిల్స్

న్యూకాజిల్‌తో పోరుకు సిద్ధమైన మాంచెస్టర్ యునైటెడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2023
09:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కారబావో కప్ సెమీ-ఫైనల్ సెకండ్ మ్యాచ్ లో నాటింగ్ హామ్ పై 2-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ గెలుపొందిన విషయం తెలిసిందే. రెడ్ డెవిల్స్ 5-0తేడాతో గెలుపొందడంతో న్యూకాజిల్‌తో యునైటెడ్‌ తలపడనుంది. నాటింగ్‌హామ్‌పై మాంచెస్టర్ యునైటెడ్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-ఫీల్డర్ ఆంథోనీ మార్షల్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మాంచెస్టర్ యునైటెడ్ మొదటి లెగ్‌లో 3-0తో నాటింగ్‌హామ్ ఫారెస్ట్‌ను ఓడించింది. అదే సమయంలో, యునైటెడ్, న్యూకాజిల్ ఫిబ్రవరి 26న ఫైనల్‌లో ఫోరుకు సిద్ధమయ్యాయి.

మాంచెస్టర్ యూనియన్

అద్భుతమైన ఫామ్‌లో మాంచెస్టర్ యూనియన్

లివర్‌పూల్ (13) తర్వాత 10వ కరాబావో కప్ ఫైనల్స్‌కు చేరుకున్న రెండవ జట్టుగా మాంచెస్టర్ యునైటెడ్ అవతరించింది. కరాబావో కప్ టైటిల్స్ ను యునైటైడ్ 8 సార్లు సాధించగా.. లివర్ వూల్ 9 సార్లు టైటిళ్లను కైవసం చేసుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. తమ చివరి 12 మ్యాచ్ లు గెలిచి విజయవంతంగా ముందుకెళ్తుతోంది. యునైటెడ్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన విషయం తెలసిందే.