#Viral Moment: మణిమారన్ సిద్ధార్థ్ మిరాకిల్ క్యాచ్.. ఆ ప్లేయర్ ఎవరంటే? (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. మునుపటి మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ సాధించిన మహ్మద్ షమీ, ఈసారి కూడా తన ఫామ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే గంటకు 114.9 కిలోమీటర్ల వేగంతో వేసిన నెమ్మది బంతిని (స్లోయర్ వన్) అభిషేక్ శర్మ సరియైన రీతిలో అంచనా వేయలేకపోయాడు. డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాలిలోకి వెళ్లింది.
వివరాలు
మణిమారన్ సిద్ధార్థ్ అద్భుత క్యాచ్
బంతి షార్ట్ థర్డ్ వైపుకు వెళ్లగా, అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న మణిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన రిఫ్లెక్స్‌తో ముందుకు దూకి క్యాచ్ పట్టాడు. అభిషేక్ శర్మ పరుగులు లేకుండా వెంటనే పెవిలియన్ చేరాడు. ఉప్పల్ స్టేడియంలోని నిండిన అభిమానులు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు. నార్ట్జే స్థానంలో జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్, మొదటి ఓవర్‌లోనే తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, సచోటికి విలువైన ఎంపికగా నిలిచాడు. మణిమారన్ సిద్ధార్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఉన్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పేసర్ నార్ట్జే పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో లక్నో యాజమాన్యం సిద్ధార్థ్‌కు అవకాశం ఇచ్చింది. ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌కు ప్రఖ్యాతి కలిగిన సిద్ధార్థ్, ఈ అద్భుతమైన క్యాచ్‌తో ఫీల్డింగ్ నైపుణ్యాన్ని కూడా చాటాడు.
వివరాలు
సిద్ధార్థ్ ప్రస్థానం ఇదే
2024 సీజన్‌లో విరాట్ కోహ్లీని తన మొదటి ఐపీఎల్ వికెట్‌ను పడగొట్టాడు. మణిమారన్ సిద్ధార్థ్ తమిళనాడుకు చెందిన లెఫ్ట్ హ్యాండర్ ఆర్థడాక్స్ స్లో బౌలర్. రాష్ట్రం తరపున TNPLలో కూడా ఆడతాడు. చెపాక్ సూపర్ గిల్లీస్, లైకా కోవై కింగ్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. డీసీ, KKR తరఫున ఆడిన సిద్ధార్థ్ 2024లో ఎల్ఎస్‌జీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆరు మ్యాచ్‌ల్లో 8.62 ఎకానమీ రేటుతో మూడు వికెట్లు సాధించాడు. టీ20ల్లో 17 మ్యాచ్‌లలో 6.41 ఓవర్లపై రన్ రేట్, మొత్తం 24 వికెట్లు సాధించాడు. మొత్తం చూస్తే సిద్ధార్థ్ మొదటి ఓవర్‌లోనే తన ప్రతిభతో లక్నో జట్టుకి అదనపు బలం ఇచ్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మణిమారన్ సిద్ధార్థ్ కళ్లు చెదిరే క్యాచ్
— crictalk (@crictalk7) April 5, 2026