Manisha Bhanwala: పసిడి పోరుకు మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత అమ్మాయి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ నుంచి మరో అమ్మాయి ఫైనల్‌కు చేరి పసిడి పతకంపై ఆశలు రేపింది. మహిళల 59కేజీల విభాగంలో మనీషా బన్వాలా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అల్‌ట్యన్ షెగయెవాపై మనీషా ఘన విజయం సాధించింది. ఈ పోరులో మొదటి నుంచే దూకుడుగా ఆడిన భారత రెజ్లర్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏకంగా 10-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థిని పిన్ చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్‌లో అడుగుపెట్టి పసిడి పతక రేసులో నిలిచింది. తుది పోరులో అమెరికాకు చెందిన అబిగల్ ఎలిజబెత్‌తో మనీషా తలపడనుంది.
వివరాలు
జైనాబ్ 5-4 తేడాతో ఓటమి
ఇప్పటికే నీలమ్ (50 కేజీలు), కాజల్ (76 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరినప్పటికీ.. వారిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. మరోవైపు భారత రెజ్లర్ తనూ శర్మ కూడా పతకంపై ఆశలు సజీవంగా ఉంచుకుంది.
మహిళల 72 కేజీల విభాగంలో కాంస్య పతక పోటీకి అర్హత సాధించింది. రెపిచేజ్ రౌండ్‌లో ట్యునీషియాకు చెందిన జైనాబ్‌ను 5-4తో ఓడించి ముందడుగు వేసింది.
అయితే 55 కేజీల విభాగంలో పోటీపడిన అహిలాకు నిరాశ ఎదురైంది. క్వార్టర్‌ఫైనల్లో తుర్కియేకు చెందిన తుబా చేతిలో 6-9తో ఓటమిపాలైంది.
వివరాలు
సుజీత్ కల్‌కల్‌కు షాక్.. 24 వరుస విజయాలకు బ్రేక్!
పురుషుల విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్‌కల్‌కు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. పసిడి పతకానికి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు క్వార్టర్‌ఫైనల్లోనే ఓటమిపాలయ్యాడు.
పురుషుల 65 కేజీల విభాగంలో తజకిస్థాన్‌కు చెందిన కుదీవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ ఉత్కంఠ పోరులో ఇద్దరి స్కోర్లు 3-3తో సమమయ్యాయి.
అయితే మ్యాచ్‌లో చివరి పాయింట్లు సాధించిన కుదీవ్ విజేతగా నిలిచాడు. దీంతో సుజీత్ టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించాడు.
ఆసియా క్రీడల ఫైనల్లో ఇదే కుదీవ్‌తో తలపడిన సుజీత్.. చివరి సెకన్లలో అద్భుతంగా పుంజుకుని అనూహ్య విజయాన్ని అందుకున్నాడు.
వివరాలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మాత్రం అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి చవిచూడటం గమనార్హం. ఈ మ్యాచ్ ఆరంభంలో సుజీత్ 3-1తో ఆధిక్యంలో నిలిచాడు.
అయితే చివరి 30 సెకన్లలో కుదీవ్ రెండు పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. చివర్లో సాధించిన పాయింట్ల ఆధారంగా విజేతగా నిలిచాడు.
ఈ ఓటమితో సుజీత్ వరుసగా సాధించిన 24 విజయాలకు బ్రేక్ పడింది.
మరోవైపు మనీషా బన్వాలా ఫైనల్ పోరులో విజయం సాధించి భారత్‌కు స్వర్ణ పతకం అందిస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.