ENG vs AUS: వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు లాబుషాగ్నే
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 315 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు ఆసీస్ బరిలోకి దిగగా, ఓపెనర్ ట్రావిస్ హెడ్ (154*) సెంచరీతో పాటు మార్నస్ లబుషేన్ (77*) అద్భుత ఆటతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో లబుషేన్ అరుదైన ఘనతను సాధించిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇంగ్లండ్ పై 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో లబుషేన్ 3 వికెట్లు తీసుకున్నాడు, ఆడమ్ జంపా 3 వికెట్లు, ట్రావిస్ హెడ్ 2 వికెట్లు, షార్ట్, డ్వారిషుస్ చెరో వికెట్ తీశారు.
లబుషేన్‌ను బలవంతంగా బౌలింగ్ చేయించాల్సి వచ్చింది: మిచెల్ మార్ష్
లబుషేన్ తన భాగస్వామ్యంలో మూడు క్యాచ్‌లను కూడా అందుకొని, హాఫ్ సెంచరీ, మూడు వికెట్లు, మూడు క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రలో నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ, కొంతమంది గాయాల కారణంగా లబుషేన్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చిందని చెప్పారు. "మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే కొంతమందికి గాయాలు అవ్వడం వల్ల లబుషేన్, ట్రావిస్ హెడ్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జట్టులో ప్రతి ఒక్క క్రికెటర్‌పై నమ్మకం ఉంది" అని మార్ష్ తెలిపారు.