IND vs AUS : మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఒక మ్యాచ్ మిగులుండగానే విజయం సాధించింది. మూడో వన్డే మ్యాచ్ (IND vs AUS) శనివారం, అక్టోబర్ 25న జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తన స్క్వాడ్‌లో కొన్ని మార్పులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌ను జట్టులో నుండి తప్పించింది. ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌లను జట్టులో చేర్చింది. అయితే, కామెరూన్ గ్రీన్ గాయపడటంతో, అనూహ్యంగా లబుషేన్ జట్టులోకి మళ్లీ వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో అతడికి స్థానం దక్కకపోవడంతో, లబుషేన్ డొమెస్టిక్ క్రికెట్‌లో క్వీన్స్‌ల్యాండ్ తరుపున ఆడేందుకు వెళ్లాడు.
వివరాలు
మాక్స్ వెల్ వచ్చేశాడు..
వన్డే సిరీస్ ముగిసిన తర్వాత, ఆస్ట్రేలియా భారత్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే తొలి రెండు టీ20లకు జట్టును ప్రకటించగా, మిగిలిన మూడు మ్యాచ్‌లకు కూడా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోయినప్పటికీ, మిగిలిన టీ20ల్లో మళ్లీ జట్టులో చోటు పొందాడు. యువ పేసర్ మహ్లి బియర్డ్‌మాన్ కూడా తొలిసారిగా జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. తుది మూడు టీ20లలో పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో బియర్డ్‌మాన్ చోటు దక్కించుకున్నాడు.
వివరాలు
మూడో వన్డేకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్),జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ,కూపర్ కోనోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్,ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్,మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే.. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్(తొలి మూడు టీ20లు), జేవియర్ బార్ట్‌లెట్, మహ్లి బియర్డ్‌మాన్ (మూడో టీ20 నుంచి), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (నాలుగు, ఐదు టీ20లకు),నాథన్ ఎల్లిస్,జోష్ హాజిల్‌వుడ్ (మొదటి రెండు టీ20లకు), ట్రావిస్ హెడ్,జోష్ ఇంగ్లిస్,మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ (మూడో టీ20 నుంచి), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.