Smriti Mandhana: స్మృతి మంధానాతో పెళ్లి రద్దు.. పలాష్ ముచ్చల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మహిళా క్రికెటర్ సూపర్‌స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై డిసెంబర్ 7న చేసిన కీలక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో జరగాల్సిన తన వివాహం పూర్తిగా రద్దైనట్లు ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. స్మృతి మంధాన వెల్లడించిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై అనేక రకాల ఊహాగానాలు, రూమర్లు మీడియాలో, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని పేర్కొంది. వాటన్నింటికీ ముగింపు పలుకుతూ, నా పెళ్లి రద్దయింది.. ఇక ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయండి. మా రెండు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి అని విజ్ఞప్తి చేసింది. భారత్‌కు మరిన్ని ట్రోఫీలు అందించడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
Details
పలాష్ ముచ్ఛల్ స్పందన ఇదే
స్మృతి మంధాన ప్రకటన అనంతరం, తన బంధం ముగిసిందని మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్ కూడా ధృవీకరించాడు. తమ విడిపోవడానికి సంబంధించి ప్రచారం అవుతున్న నిరాధారమైన వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటిని వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించాడు. అంతేకాక నా వ్యక్తిగత సంబంధం నుంచి బయటపడటం నాకు చాలా కష్టమైన దశ. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. తప్పుడు, ఆధారంలేని వార్తలను ప్రజలు ఎంతో సులభంగా నమ్మడం చూసి బాధేసింది. కానీ ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తానన్న నమ్మకం ఉందని పలాష్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
Details
పెళ్లి ఎందుకు వాయిదా పడింది?
ఆధారాలు లేని వార్తలను ప్రసారం చేసే ముందు మీడియా ఆత్మపరిశీలన చేయాలని సూచించిన ఆయన, తన ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. స్మృతి మంధాన-పలాష్ ముచ్ఛల్ పెళ్లి నవంబర్ 23వ తేదీన జరగాల్సివుంది. అయితే కార్యక్రమానికి కొన్ని గంటల ముందే మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామం వల్ల పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు మంధాన ప్రకటించింది. ఆ ఘటన తర్వాత కొద్ది రోజులకే పలాష్ ముచ్ఛల్ కూడా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. చివరికి ఈ మొత్తం పరిస్థితుల్లో వీరిద్దరూ పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.