Loading...
Martinez: హృదయ విజేత మార్టినెజ్‌.. ఓడినా ప్రపంచం మెచ్చిన గోల్‌కీపర్‌!
హృదయ విజేత మార్టినెజ్‌.. ఓడినా ప్రపంచం మెచ్చిన గోల్‌కీపర్‌!

Martinez: హృదయ విజేత మార్టినెజ్‌.. ఓడినా ప్రపంచం మెచ్చిన గోల్‌కీపర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించినా.. మ్యాచ్‌ పూర్తిగా స్పెయిన్‌ ఆధిపత్యంలోనే కొనసాగింది. దూకుడైన ఆటతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని స్పెయిన్‌.. సమష్టి ప్రదర్శనతో అర్జెంటీనాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అదనపు సమయంలో ఫెరాన్‌ చేసిన విజేత గోల్‌తో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌కు ఫెరాన్‌ హీరోగా నిలిస్తే.. ఓడిన అర్జెంటీనా తరఫున అసలైన హీరో గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌. జట్టు ఓటమిపాలైనప్పటికీ అతడు ప్రదర్శించిన పోరాటం ఫుట్‌బాల్‌ అభిమానులు చాలా కాలం గుర్తుంచుకునేలా చేసింది. సహచర ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. మార్టినెజ్‌ మాత్రం తన అద్భుత గోల్‌కీపింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వివరాలు

రికార్డు స్థాయిలో సేవ్ లను చేసిన ప్లేయర్

విరిగిన వేలితోనే బరిలోకి దిగిన మార్టినెజ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో రికార్డు స్థాయిలో సేవ్‌లు చేశాడు.

అతడి అసాధారణ ప్రదర్శన లేకపోయి ఉంటే మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లేది కాదు. స్పెయిన్‌ మరింత భారీ తేడాతో విజయం సాధించే అవకాశం ఉండేది.

స్పెయిన్‌ వరుస దాడులతో అర్జెంటీనా రక్షణ పూర్తిగా కకావికలమవుతున్నా.. మార్టినెజ్‌ మాత్రం గోల్‌పోస్ట్‌ ముందు గోడలా నిలిచాడు.

ప్రత్యర్థి నిర్విరామ దాడులను అపారమైన పట్టుదలతో అడ్డుకున్నాడు.

6.5 అడుగుల ఎత్తున్న మార్టినెజ్‌ ఈ ఫైనల్లో ఏకంగా 11 సేవ్‌లు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నిర్ణీత సమయం ముగిసే వరకు అర్జెంటీనా ఆశలను సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు.

వివరాలు

ట్రోఫీని ముద్దాడిన స్పెయిన్

అయితే మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

అర్జెంటీనా పది మందికే పరిమితం కావడం, స్పెయిన్‌ నుంచి వచ్చిన ఊపిరిసలపని దాడుల ఒత్తిడిలో చివరకు మార్టినెజ్‌ గోల్‌ ఇవ్వక తప్పలేదు.

ఫెరాన్‌ చేసిన విజేత గోల్‌తో స్పెయిన్‌ ట్రోఫీని అందుకుంది. అర్జెంటీనా ఓటమిపాలైనప్పటికీ.. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 11 సేవ్‌లు చేసిన గోల్‌కీపర్‌గా ఎమిలియానో మార్టినెజ్‌ చరిత్ర సృష్టించాడు.

ఓడిన జట్టులోనూ తన అసాధారణ పోరాటంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

ADVERTISEMENT