Page Loader
Rohit Sharma - Jaspit Bumrah: హైదరబాద్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ, బుమ్రా
హైదరబాద్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ, బుమ్రా

Rohit Sharma - Jaspit Bumrah: హైదరబాద్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ, బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
10:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్పిత్ బుమ్రా తమ కెరీర్లలో అరుదైన ఘనతను సాధించారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రమాదకరమైన హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేయడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఇది బుమ్రా కెరీర్‌లో 300వ టీ-20 వికెట్ కావడం విశేషం. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు, ఐపీఎల్‌ మ్యాచ్‌లను కలిపి బుమ్రా ఇప్పటి వరకు 300 వికెట్లు పడగొట్టాడు. ఇది ఆయనకు అరుదైన ఘనతగా నిలిచింది.

Details

12వేల పరుగుల మార్కును దాటిన హిట్ మ్యాన్

ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో విశేష రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి రోహిత్ తన టీ-20 కెరీర్‌లో 12,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ-20లు, ఐపీఎల్ మ్యాచ్‌లు కలిపి రోహిత్ 12 వేల పరుగులు పూర్తిచేశాడు. ఇంకా, ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో అర్ధశతకం సాధించిన రోహిత్ శర్మ ముంబై విజయానికి మద్దతుగా నిలిచాడు. ఆయన ఫామ్ ముంబై బలంగా నిలుస్తోంది.