LOADING...
AUS vs IND: వర్షం కారణంగా రద్దైన టీమిండియా.. ఆసీస్‌ తొలి టీ20 
వర్షం కారణంగా రద్దైన టీమిండియా.. ఆసీస్‌ తొలి టీ20

AUS vs IND: వర్షం కారణంగా రద్దైన టీమిండియా.. ఆసీస్‌ తొలి టీ20 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం కాన్‌బెర్రాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. కేవలం 9.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా, ఆట ఆగే సమయానికి భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి 97 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆది నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ తనకు దక్కిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాథన్‌ ఎల్లిస్‌ వేసిన 3.5వ ఓవర్‌లో ఫీల్డర్‌ మీదుగా బంతిని ఎగరేసే ప్రయత్నంలో అతడి షాట్‌ గాల్లోకెగిరింది.

వివరాలు 

ఓవర్ల సంఖ్యను 18కి కుదింపు 

టిమ్‌డేవిడ్‌ చక్కగా క్యాచ్‌ పట్టడంతో అభిషేక్‌ 14 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) చేసి పెవిలియన్‌ చేరాడు. భారత్‌ తొలి వికెట్‌ను 35 పరుగుల వద్ద కోల్పోయింది. తరువాత సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చి గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో ఐదో ఓవర్‌ ముగిసిన వెంటనే వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కొంతసేపటికి వాన ఆగడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది, అయితే ఓవర్ల సంఖ్యను 18కి తగ్గించారు. మ్యాచ్‌ మళ్లీ మొదలైన తర్వాత కొద్ది సేపటికే సూర్యకుమార్‌ 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. జేవియర్‌ బ్రెట్‌లెట్‌ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ వదిలేశాడు.

వివరాలు 

సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌ అక్టోబర్‌ 31న జరగనుంది

అనంతరం ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ,కేవలం 32 బంతుల్లో రెండో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక భారత బ్యాటర్లు రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో,9.4ఓవర్ల వద్ద మళ్లీ వర్షం అడ్డుపడింది. ఆ సమయంలో భారత్‌ స్కోర్‌ 97/1గా ఉంది.అంతకుముందు 9.3వ ఓవర్‌లో నాథన్‌ ఎల్లిస్‌ వేసిన బంతిని సూర్యకుమార్‌ అద్భుతంగా సిక్స్‌గా కొట్టాడు. ఇది అతడి టీ20 కెరీర్‌లో 150వసిక్స్‌.86 ఇన్నింగ్స్‌లలో, మొత్తం 1649 బంతులు ఎదుర్కొని ఈ మైలురాయిని చేరుకున్నాడు. తరువాత వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి శుభమన్‌ గిల్‌ 37 పరుగులతో,సూర్యకుమార్‌ యాదవ్‌ 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌ అక్టోబర్‌ 31న మెల్‌బోర్న్‌లో జరగనుంది.