Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేననాయక్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.
అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బుధవారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తు బృందానికి అతడు లొంగిపోయాడు.
అనంతరం సచిత్ర సేనా నాయక్ ను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన కొలంబో కోర్టు మూడు వారాల కిందటే అతడు విదేశాలకు వెళ్లకుండా స్టే విధించింది.
శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హజరుకానున్న మొదటి క్రికెటర్ సేనా నాయకే కావడం విశేషం.
Details
లంక్ ప్రీమియర్ లీగ్ మ్యాచులో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు
సేనా నాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచులో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీని కోసం ఇద్దరు ఆటగాళ్లను సేనా నాయకే టెలిఫోన్‌లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.
ఇక సేనానాయకే పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాలని క్రీడాశాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను అటార్నీ జనరల్ కోరారు.
శ్రీలంక తరుపున 49 వన్డేలు, 24 టీ20 మ్యాచులు, ఒక టెస్టు మ్యాచును ఆడాడు. 2012 నుంచి 2016 వరకు శ్రీలంక తరుఫున ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లను పడగొట్టాడు.