Loading...
#Match Recap : 15 ఏళ్ల కుర్రాడి తుఫాన్ ఇన్నింగ్స్.. కుప్పకూలిన చెన్నై..అగ్రస్థానంలోకి రాజస్థాన్
15 ఏళ్ల కుర్రాడి తుఫాన్ ఇన్నింగ్స్.. కుప్పకూలిన చెన్నై..అగ్రస్థానంలోకి రాజస్థాన్

#Match Recap : 15 ఏళ్ల కుర్రాడి తుఫాన్ ఇన్నింగ్స్.. కుప్పకూలిన చెన్నై..అగ్రస్థానంలోకి రాజస్థాన్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే పూర్తయ్యాయి గానీ, పాయింట్ల పట్టికలో మార్పులు వేగంగా మారుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులతో పాటు 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ నమోదు చేసిన భారీ విజయం పట్టికలో సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.

వివరాలు 

ముగిసిన మూడు మ్యాచ్‌లు..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగిశాయి.

మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచింది.

మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తన ఆధిపత్యాన్ని చాటింది.

గువహటి వేదికగా జరిగిన ఈ పోరులో రాజస్థాన్ బౌలర్లు నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో చెన్నై జట్టును కేవలం 127 పరుగులకే పరిమితం చేశారు.

ఆ తరువాత చిన్న లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా చేధించింది.

వివరాలు 

వైభవ్ సూర్యవంశీ మెరుపు ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.

కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను 15 బంతుల్లో అర్ధశతకం సాధించి ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు.

అతని దూకుడు ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేరుకుంది.

దీని వల్ల జట్టుకు పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్‌లో కూడా భారీ లాభం దక్కింది.

ADVERTISEMENT

వివరాలు 

అగ్రస్థానంలోకి రాజస్థాన్

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో నిలిచింది.

రాజస్థాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లకు సమానంగా రెండేసి పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్‌లో రాజస్థాన్ ముందంజలో ఉంది.

రాజస్థాన్ రాయల్స్: +4.171 నెట్ రన్ రేట్‌తో మొదటి స్థానం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: +2.907 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానం

ముంబై ఇండియన్స్: +0.687 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానం

ADVERTISEMENT

వివరాలు 

చెన్నైకు భారీ దెబ్బ..

ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద నష్టం వాటిల్లింది.

మ్యాచ్ ఓడిపోవడంతో పాటు నెట్ రన్ రేట్‌లో కూడా గణనీయమైన తగ్గుదల ఎదురైంది.

ప్రస్తుతం చెన్నై నెట్ రన్ రేట్ -4.171కి పడిపోయింది. పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఈ జట్టు, ఇతర జట్లు తమ తొలి మ్యాచ్‌లు ఆడిన తర్వాత చివరి స్థానానికి చేరే అవకాశముంది.

ఈ పరిస్థితిని మార్చుకోవాలంటే చెన్నై రాబోయే మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది.

వివరాలు 

తదుపరి మ్యాచ్‌‌లో తలపడేది వీళ్లే..

ఇప్పుడు అందరి దృష్టి మార్చి 31, మంగళవారం జరిగే నాలుగో మ్యాచ్‌పై ఉంది.

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ ఫలితం కూడా పాయింట్ల పట్టికలో మరిన్ని మార్పులకు కారణమయ్యే అవకాశముంది.

ADVERTISEMENT