Chahal - Dhanashree: విడాకులు తీసుకున్న భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ విడాకులను మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు.
విడాకుల పిటిషన్‌పై విచారణ కోసం ఈ రోజు మధ్యాహ్నం చాహల్, ధనశ్రీ కోర్టుకు హాజరయ్యారు.
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును బాంబే హైకోర్టు రద్దు చేసింది.
మార్చి 20లోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అనంతరం కోర్టు అధికారికంగా విడాకులను మంజూరు చేసింది.
వివరాలు
చాహల్,ధనశ్రీ 2020లో వివాహం
చాహల్,ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో చేసిన కొన్ని పోస్టులు అభిమానుల్లో అనేక అనుమానాలకు కారణమయ్యాయి.
వీరిద్దరూ ఒకరినొకరు సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫాలో చేయడం, అలాగే ధనశ్రీ తన పేరులో నుంచి 'చాహల్' పదాన్ని తీసివేయడం కారణంగా వీరి మధ్య విబేధాలు పెరిగాయని వార్తలు వెలువడ్డాయి.