Matt Renshaw: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్షా.. ఒకే మ్యాచ్‌లో 272 పరుగులు, రెండు వికెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మ్యాట్ రెన్షా టెస్టు క్రికెట్లోకి అద్భుతమైన పునరాగమనం చేశాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులతో భారీ సెంచరీ సాధించిన రెన్షా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 272 పరుగులు సాధించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
రెన్షా అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో 250కి పైగా పరుగులు చేయడంతో పాటు కనీసం రెండు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రెన్షా రికార్డులకెక్కాడు.
స్వదేశీ, విదేశీ ఆటగాళ్లలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
గతంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ 2012లో డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో 224 పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టాడు.
అయితే, అతడు 250 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు.
ఇప్పుడు రెన్షా ఆ రికార్డును అధిగమించి టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
వివరాలు
ఆస్ట్రేలియా ఘన విజయం
మరోవైపు, ఈ టెస్టులో ఆస్ట్రేలియా 214పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
421 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. చివరి రోజు మంగళవారం 102/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది.
అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి 86.5 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 75పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 10ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజల్‌వుడ్ 49 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టెస్టు క్రికెట్లో ఇదే అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. చివరి రోజు దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు వికెట్లను హాజల్‌వుడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
ఆస్ట్రేలియా ఘన విజయం
రెన్షా కూడా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో భాగమయ్యాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 284 పరుగులకే పరిమితమైంది.
అనంతరం ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 314/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
దీంతో దక్షిణాఫ్రికా ముందు 421 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన సఫారీ జట్టు ఓటమి పాలైంది.